పుట:Nanakucharitra021651mbp.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలె మీదబడి మనుష్యులను దూషించి వీలగునేని జేయిచేసికొను పరమభాగవతులు ప్రతిమతమున వేనవేలు గలరు. మెక్కా మెదీనాపట్టణములకుబోయి యాపుణ్యభూముల జూచినపిదప మహమ్మదు వారినిగూర్చి నానకున కెట్టియభిప్రాయము కలిగెనో శిష్యుడగు బలిని యీక్రిందివాక్యములవలన స్పష్టమగును. ఈమాటలు బలుని నోటనుండి వచ్చినను గురునియభిప్రాయములే యగుట నిజము.

మహమ్మదువారినిగూర్చి గురునియభిప్రాయములను బలు డీక్రిందివిధమున దెలిపెను. "మహమ్మదువారిస్వభావమున మహాత్ముల కుండవలసినంతశాంతము కానబడక కోపపు పాలెయెక్కువ గానబడు చున్నది. పునర్జన్మరాహిత్య మగునంతటివైరాగ్యము గూడ నాయనయొద్ద నున్నట్లు గానబడదు. స్వలాభపరాయణత యక్కడక్కడ గానబడుచున్నది. ఆయన పరిశుద్ధుడు నిష్కళంకచరిత్రుడు ననుట కెంతమాత్రము సందియము లేదు గాని సంపూర్ణ మైనపవిత్రత సంపాదించుటకు జన్మపరంపరనుండి విమోచనము మొందుటకు నీమహాత్ముడు మరలజన్మము నొందవలయు. ఆజన్మము హిందూస్తానమున నొకశూద్రునియింట గావలయు. ఆయన జీవన్ముక్తు డైయొకానొకకాలమున బరలోకారోహణము చేసి ఈశ్వరసందర్శనము చేసెనని చెప్పెడిమాటలు కేవలము కల్పితములు. ఏలయన నీప్రపంచమున సృష్టింపబడినజంతువులె