పుట:Nanakucharitra021651mbp.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముతో మందలించెను. అతనికి గురు విట్లు ప్రత్యుత్తరమిచ్చె. 'దేవునిగృహ మేప్రక్కను మాత్రమే యుండి యేప్రక్కను లేదో నాకు దెలియదు. నీవెఱుగుదువేని నాకాళ్లు చేతపట్టుకొని దేవుని మందిరములేని ప్రక్కకు వాటిని ద్రిప్పుము." ఆలయాధికారి వాని పలుకులు విని మతమునైనను లెక్కసేయక నోట పరిహాసములు సేయు మొండివాడై యుండవచ్చునని భావించి వాదము ముదరనీయక యంతతో సరిపెట్టెను. మెక్కావెళ్లిన మహమ్మదీయులు మహమ్మదువారు పరమపదము వేంచేసిన స్థానమగు మెదీనాకువెళ్ళి యాయనసమాధిజూడక పోరు. నానకు మెక్కాలోజూడవలసిన వైచిత్ర్యములనెల్లజూచి సంతుష్టుడై మెదీనాకుగూడ బోవదలంచుచుండ మర్దనుడు తన గురువు మెదీనాకు జనండనుకొని యక్కడకుబోక తప్పదని పట్టుపట్టెను. అదివరకే వెళ్ళదలచిన గురువు శిష్యుని ప్రోద్బలముచేత వెంటనే బయలుదేరి పండ్రెండుదినములు పయనముచేసి మెదీనాపట్టణముజేరి మహమ్మదు సమాధింజూచి కొన్నిదినములచ్చట నుండెను. ఆదినములలో నతడు మెక్కాలో వలెనే యిక్కడను సమాధివైపుకాళ్లుచాపి శయనించుచువచ్చెను. మెక్కాలోనున్న యాయజమానునికంటె మెదినాలోనున్న సమాధియజమానుడు చండతరుడు దురహంకారుడు. ఇందక్కజ మేమున్నది. దేవుని దూషించునప్పుడు సయితము నోరెత్తక గురువుల పేరెత్తినతోడనే రాక్షసుల