పుట:Nanakucharitra021651mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశింపబడిన జ్ఞానవాక్యములయందు నమ్మికగల జనులు నిర్భయముగ తమధర్మముల ననుష్ఠించి యితరులకు మార్గప్రదర్శకులై యుండవలయునని యాయన యెల్లచోటుల నొక్కి చెప్పుచువచ్చె.

అరేబియా ప్రయాణములలో నానకు వాని శిష్యులు నిర్బాధకముగ నన్నిప్రదేశములుం జూచుటకు తురకవేషములు వేసికొనిరి. నానకు సహజముగ కలహముల కిష్టపడని పరమసాధువౌటచే జగడములు రాకుండ నుంటకట్లు వేషము మార్చెనేకాని భయముచేత నెంతమాత్రముకాదు. ఏలయన నానకు మహమ్మదువారి జన్మప్రదేశమగు మెక్కాపట్టణమునకు బోయి పుణ్యభూములు చూడదలంచియు మహమ్మదీయులకు విరుద్ధములగు నాచారములనే గొన్నిటిని నెరపుచువచ్చెను. మెక్కాలో మహమ్మదీయుల కొక్క యాలయముగలదు. కాబా యని దానికిం బేరు. ఆయూరుకిబోయిన మహమ్మదీయు డెవ్వడు దన కాళ్ళు కాబాయున్న వైపునకుజూపి పగలుకాని రాత్రికాని శయనింపడు. పండుకొన్నప్పుడు తలయే కాబావైపున నుండవలయు. నానకు తరుచుగా రాత్రులు పండుకొనునప్పుడు తనకాళ్ళు కాబావైపునకు జాపుచువచ్చె. తురకలకు భయపడినవాడట్లు చేయునా? ఆగుడియధికారి యొకనాడు శాస్త్రవిరుద్ధముగా శయనించిన నానకునుజూచి దైవగృహమువైపు కాళ్ళుచాపుట యనాచారమని కఠినస్వర