30
నాయకురాలు
కే : అయ్యా ! నే ఈదేశపువాడినే, రెడ్లము.
ము : అది కనుపడుతూనే వున్నది.
కే: వారు మన రాజుగారి సోదరులు.
ము : అయ్యా ! తమరేనా పగటినిద్దురబోతూ పల్నాడు పంచి పెట్టింది ?
కే: మేలుకుండి పంచిపెట్టగూడదా ?
ము : అది నిద్దురమత్తులపనే, సరే, నాపేరు రామిరెడ్డంటారు,
కే: నాగమ్మగారు తమపుత్రికేనా ?
రా: మఱె - మాపిల్లే - లోపలికి దయచెయ్యండి. మెల్లాలో కూర్చున్నది. ( తెరలోనికి పోతారు)
[ నాగమ్మ ప్రవేశము ]
నాగ : [ ప్రత్యుద్ధానం చేస్తూ ] అయ్యా ! కేతురెడ్డిగారా, గురిజాలకోటకు అధ్యక్షులే ! దయచెయ్యండి. ఓహో ! నరస ప్రభువుగారా; ఏమిసుదినం ! సాక్షాత్తు దొరలే యీ కుటీరములో అడుగుబెట్టారు ! బీదల కుటీరములుకూడ చూస్తుంటేనేగాని రాజభవనముల వైభవాతిశయం తెలియదు.
న: కాదు, మా నిద్దురమత్తు వదలదనండి,
నా ; సరె, మా అయ్యగారితో తమకు సంభాషణ జరిగినట్టున్నది. వారి కవి మామూలుమాటలే; రాజులు సోమరులూ, నిద్రమత్తులూ అని వారి అభిప్రాయం.
న: అది నిశ్చయంగూడాను.
నా : కాని తమబోటివారిని మినహాయించక తప్పదు. పాదప్రక్షాళనం జేసి యిటు తివాసిమీదికి దయచేయండి.