పుట:Naayakuraalu.Play.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

29

న : మన రాజకీయవ్యవహారములలోకి పూర్తిగా దిగింది.

కదుళ్లె కత్తులు - వెదుళ్లె గదలు
రండెమ్మ మీరంత - దండుబోదాము

కే: రాజా, గామాలపాటి వీరవనితలె మార్గం జూపిస్తున్నారు. ఈ వీరమాతయొక్క పదమునే మనము ఉపశ్రుతిగా తీసికొనవచ్చును.

న : ఉపశ్రుతిమాత్రమేగాదు. బస్త్రీలు నిద్దురబోతుంటే పల్లెటూళ్లుడికిపోతున్నవని యీ పాట ఋజువు జేస్తున్నది.

[ ఒక ముసలివాడు ప్రవేశము ]

కే : అయ్యా ! నాగమ్మగారిల్లెక్కడ ?

ము: ఇదే.

న : వా రేమి జేస్తున్నారు ? నిద్దురలేచారా ?

ము : అయ్యా ! మీదు పరదేసులా ? పల్నాట పగటినిద్దుర లేదే? ?

కే: వారు కొద్దికాలము క్రిందటనే యీ దేశము వచ్చారు. దేశాచార మామ్లీతు తెలియదు.

ము: రాజులా? రాజబంధువులా ? అంతకంటే పరాయి లెవరున్నారు, ఈ దేశములో ?

కే: మా సంగ తెందుకులెండి ! అమ్మగా రింట్లో వున్నారా ?

ము : మా సంగతి మీకూ వద్దు.

కే: అయ్యా ! తమపేరు ?

ము : అదిమటు కెందుకు ? పరాయిగా వచ్చినవారు మీ సంగతి చెప్పకపోతే నే నంతవెఱ్ఱివాడి ననుకున్నావా, మా సంగతి జెప్పడానికి ?