పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
301


తిరుపతి వేంకట కవులకు హెచ్చరిక

మనోరంజని పత్రిక : 17-12-1914

గురు విశ్వనాథకవులు

ఓ యెండగండి కవు లా
రా! యిది యాలింపుఁడయ్య యలుగక; సత్యా
ర్థాయత్తుల కింపును దు
ర్దీయుతులకుఁ గినుకఁ దెచ్చు తెలివిడి యగుటన్

బాంధవులు రామకృష్ణులు పగరలగుట
భీమ విజయులనందగి బిరుదుగనిన
సోదరులు ప్రాణ శత్రులై చూడఁబడుట
నెఱుఁగనయ్యె మీకురు బలం బిట్టి దంచు

సభకేఁగు దెంచి యాసనముఁ గోరని కొప్ప
         రపుఁ గవిపైఁ గల్ల వ్రాయుటయును
అనవసరమ్ముగా నాసనమ్మున కాసఁ
          జెందియు గజిబిజి చేయుటయును
పండితుఁడీ రీతిఁ బల్కరాదని తత్స
          భాస్తారులనఁ దల వంచుటయును
అవధానములఁ దప్పి యవి యెఱింగించు య
          థార్ధవాదులఁ దూలనాడుటయును