పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

హితులని యసత్యవాదుల నెంచుటయును
వలదిటులనన్న వారల వదరుటయును
కలహ భోజనులకు విందు సలుపుటయును
గలుగు భవదీయ చరితంబుఁ దలఁపఁ దరమె?

అంగదుఁడాడు సంధివచనార్ధ మపార్ధముచేసి రావణుం
డంగదఁ జెంది నట్టు లహహా మన గుంటురి వారి సంధి వా
క్సంగతి లెక్కసేయ కెకసక్కెము లాడెసు వేంకటేశ్వరుం
డింగిత మేమియంచు నగరే తమ వారలు నాఁడు ఖిన్నులై

వచ్చెనెటో దురోదరము వంక విశంకటమైన పోరు మీ
యిచ్చకు వచ్చినట్లనకుఁ డీ వీనుఁడీ తగు సంధి వాక్యమున్
గచ్చలు మానుఁడీ యనుజనార్దను పల్కసమర్థు పల్కుఁగాఁ
దచ్చనచేసి కౌరవులు దర్పము సూపినయట్లు సూపుడున్
వచ్చెగదా పరాభవము భావము శాంతిల నింకనేని వి
ద్వచ్చయ మాననీయమగు పద్ధతి నుద్దతి మానియుండుఁడీ.

ఇప్పటి రూల్సున కేము కట్టుంబడ
          మంటిరి జైలుల నరయుఁడయ్య
పేర్చి దేవుని లక్ష్యపెట్టమేమని యంటి
          రింక లంకావాస మెంచుఁడయ్య
లలిఁబాసి మాకు వల్లభులు లేరంటిరి
          భరణంబునకు దావ వైపుఁడయ్య
జనసఖ్య మడఁగినఁ జచ్చిపోమంటిరి
          మృషసఖ్యమైనఁ గోరెదరటయ్య

బలు సముద్రము మోకాలు బంటి యనెడు
దానికిం బూనితిరటయ్య తగదు తగదు