పుట:Bhaarata arthashaastramu (1958).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రీతి, కామము మొదలైనవి చిత్తగతములు. చిత్తము అతి చంచలము. ఈ చంచలత్వమును నిరోధించునవి, ప్రాణరక్షణమునకు సాధనములైన యార్థిక స్థితిగతులును, శత్రు నిరాసనకారియైన యన్యోన్యతయు, వీనియొక్క నిర్బంధము లేకున్నయెడల నేడు ప్రేమింతుము. ఱేపుగలహింతుము. ఒకప్పుడు కూడుదుము. వేఱొకప్పు డెడబాయుదుము. సంఘీభావము దృఢమై యుండదు. సంఘోద్ధారణ క్రియను భరించునవి ప్రాణరక్షణ క్రియలు.

మఱియు నొక విశేషంబు. ప్రాణము లశాశ్వతముగా నిల్పు చర్యలన్నియు మొత్తముమీద నాహ్లాదకరములు . కామంబు వాత్సల్యంబు నత్యంత సుఖదాయకంబులని వేఱుగ జెప్పవలయునా? ఇవి యెల్లరు గుర్తించునవి. బిడ్డకు పాలిచ్చుటలో బిడ్డకు సుఖమే. తల్లికిని సుఖమే. సంఘపరమైన కార్యజాతంబు లుభయపక్షంబులకు సంతోషమే నొసంగునవి. కావున సుఖములు గర్హ్యములనువారు ప్రాణహింస యను వ్రతము దాల్చినవారు గాని కరుణామయాత్ములు గారనుట సత్యము.

సహజేచ్ఛాప్రధానమైనది దాంపత్యము. దీనిసృష్టికి కాలము మూలమైనను, స్థితికి నార్థికవ్యవహారము లాధారములు. ఎట్లన్న, కామము పలుపోకల బోవునది. ఒకయెడ స్థిమితమై యుండునదిగాదు. ఇట్లు పలుతెఱంగుల సంచరించునదియైన కుటుంబము లేర్పడవు. కుటుంబము లేర్పడవేని కృష్యాదిక్రియలు వెలయవు. కృష్యాదు లసంభవములైన భుక్తికిలేక చత్తురు. కావున కామమునకు నిలుకడ నిచ్చునది జీవనోపాయము. వివాహమాడుటయేల? భార్యాభర్తలు ప్రాణపోషణమున నన్యోన్య సహాయకర్తలగుటకు. ఈ సహాయ మనావశ్యకమైనచో లోకమెల్ల రాసక్రీడయం దభిరుచిగలిగి యేచింతయు లేక మనవచ్చుగదా! రాసక్రీడకు విఘ్నకారి యుదరభారము. కలి