పుట:Andhraveerulupar025903mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని తనవిజయము సర్వంకషము గాదని తలంచి కృష్ణాతరంగిణి గోదావరిదాటి పరిజనముతో దండయాత్రకు బయలువెడలెను. కృష్ణదాటినదిమొదలు గజపతిసైన్యము ప్రతిగ్రామమునందును దనబలము నెదిరించుచునే వచ్చెను. ఇంతలో విద్యానగరమునుండి వచ్చిన నూతనబలము గలిసికొనెను. తనబల మంతయు నష్టమగుటచే గజపతి ప్రతిఘటించి లాభములేదని కుటుంబముతో గొండగుహలలో దలదాచుకొన బాఱిపోయెను. గౌతమిదాటి రాజమహేంద్రవర దుర్గమును జయించి యచట తనప్రతినిధి నుంచి మన్నెపు సంస్థానములను రాజమహేంద్రవరము నాక్రమించుకొని రహితాపురము లోనగు మన్నెసంస్థానములను రాయలు జయించెను. తరువాత బాహుబలేంద్రుని వంశజులకు ----ధానియగు పొట్నూరు జయించి యచట మిగుల నున్నతమగు జయస్తంభము నాటించెను. మాడుగుల వడ్డాదిని గూడ జయించి రాయలు పరిజనముతో గొంతకాలము సింహాచలమున విశ్రమించి నృసింహస్వామికిబెక్కుదానములు గావించి శాసనముల స్థాపించెను. అనేకామూల్యాభరణములు సమర్పించి నిత్యనైవేద్య భోగాదికములకు గొన్ని వృత్తులొసంగి దృష్టి ముందునకు బఱపెను. కటకము ప్రాంతములందు సాత్రవంశజులు బలవంతులై యుండిరని రాయలు గ్రహించి సైన్యమలసియున్నను, రణయత్నము ఇప్పటికి మానుదమని తిమ్మరుసుమంత్రి వారించుచున్నను, లెక్కసేయక