పుట:Andhraveerulupar025903mbp.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అఃహోరాత్రము లరణ్యములలో గొండలలో సైన్యమును నడిపించి కటకమునకు బ్రయాణమయ్యెను. త్రోవలో గలిగిన కష్టనష్టములను బాటిసేయక నిరుత్సాహపడక కృష్ణదేవరాయలు కొన్నిదినములకు కటక సమీపమునకు జేరి తనరాక తెలియునటుల విజయభేరిని మ్రోగింపజేసెను. కృష్ణదేవరాయలు కటకమునకు జేరకమున్నె ప్రతాపరుద్రగజపతి కటకము జేరెను.

కటకపరిసర భాగములను ప్రతాపరుద్రగజపతియాజ్ఞావర్తులు పాత్రసామంతరాజులు అపరిమిత బలవంతులై పదియాఱుమంది పరిపాలించుచుండిరి. రాయలు తమదుర్గము పైకి దండయాత్రకు వచ్చినవార్త విని పాత్రసామంతు లెదిరింప నుత్సాహపడి ప్రతాపరుద్రగజపతి సంగరానుజ్ఞ వేడిరి. దూరదృష్టిలేని గజపతి చేయునది లేక వేల తన సైన్యమునకు సంగరానుజ్ఞ నొసంగెను. పాత్రసామంతులందఱు తమతమ స్వాధీనమునందున్న బలము నంతయు సమకూర్చుకొని రాయల సైన్యము మీదికి సంగరమునకు దలపడిరి. మన్నెములలో నెడతెగక ప్రయాణములు గావించుట చేతను ననారోగ్య ప్రదేశ నివాసవశమునను రాయల సైన్యము చాల నీరసస్థితిలో నుండెను. పలువురు సైనికులు పాత్రసామంతుల సైనికులచేత వధింపబడిరి. కృష్ణదేవరాయల సైన్యమే దండయాత్రయందును యింతవఱకు జెందని వినాసము నాడు చెందెను. రాయ లీ