పుట:Andhraveerulupar025903mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లతో బయటబడిన నంతియచాలునని గజపతి హతశేషమగు సైన్యముతో వెనుక కేగెను. కృష్ణదేవరాయలు వెనుకకు మఱలి కొండవీటికి జేరెను. అంతకుమున్నె తిమ్మరుసుమంత్రి రెండుమాసములపైగా గొంటవీటి దుర్గమును ముట్టడించి క్రీ.శ.1515 సంవత్సరము జూను 23 వ తేదీని కొండవీటి దుర్గమును స్వాధీనముగావించుకొని యసమాన విజయమునొంది వీరభద్రగజపతిని జీవగ్రాహిగ జేకొనెను. పలువురు వీరులుకూడ బట్టువడిరి. కృష్ణరాయలు తిమ్మరుసు కొండవీటిని జయించినటు లొకశాసనమును స్థాపించి కొండపల్లిని జయించుటకు బయనమయ్యెను. ఆకాలమున బ్రహరేశ్వర పాత్రాదులు కొండపల్లిదుర్గమును బాలించుచుండిరి. కొండపల్లిని రాయలు మూడుమాసములు భయంకర సన్నాహముతో ముట్టడించి ప్రతాపరుద్రగజపతి భార్యలలో నొక్కతెను బెక్కుమంది సేనానాయకులను జీవగ్రాహలుగ జేకొని కొండపల్లి దుర్గమును స్వాధీనపఱచికొనెను. తరువాత అనంతగిరి, కంబముమెట్టు, ఊరుగొండ మున్నగు దుర్గములను జయించి తనప్రతినిధుల నందందుంచి కొండవీటికి జేరెను. కొండవీటిలో గొంతకాలము విశ్రమించి తిమ్మరుసుమంత్రి --------- నాదెండ్ల అప్పామాత్యుని ప్రతినిధిగనుంచి తాను బందిగొన్న వీరుల నందఱను విద్యానగరమునకు బంపెను.

విద్యానగరము నుండి కొంతసైన్యము వచ్చునటులనేర్పాటుచేసి కృష్ణదేవరాయలు గజపతుల రాజ్యమును హరించిన