పుట:Andhraveerulupar025903mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పించి పదునెనిమిదిమాసము లేకధాటిగ నుదయగిరిని ముట్టడించెను. ఆహారాదులు తగ్గుటచేతను బలము నశించుటచేతను ఉదయగిరి దుర్గము రాయలకు సాధ్యమయ్యెను. వెంటనే సేనాధీశ్వరులు దుర్గమును బగులగొట్టిరి. కృష్ణదేవరాయలు పరిజనముతో దుర్గమున కేగి సేనాదికమును వశపఱచుకొని దుర్గపాలకుడగు తిరుమలకాంతరాయల జెఱగొని రాయసము కొండమరుసయ్యను ఉదయగిరి రాజ్యమునకు బ్రతినిధిగా నియోగించి హతశేషమగు బలముతో తిమ్మరుసుమంత్రికి సహాయము బోయెను. ఇంతలో విద్యానగరమునుండి క్రొత్తసైన్యమువచ్చి రాయల సైన్యముతో గలిసెను. కృష్ణదేవరాయలు తిమ్మరుసు మంత్రియు రెండుసంవత్సరములు గజపతి సైన్యముతో బోరాడి విజయము గడించి యంతతో దృప్తినొందక గజపతుల బలమున కాయువుపట్టుగానున్న కొండవీటిదుర్గమును బట్టుకొనుటకు బయలుదేరిరి.

ప్రతాపరుద్రగజపతి కుమారుడగు వీరభద్రగజపతి కొండవీటి దుర్గమును బాలించుచుండెను. అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరము దుర్గము లీకొండవీటి దుర్గముక్రిందవె. ఉదయగిరిదుర్గము కృష్ణదేవరాయలు జయించిన వార్తవిని వీరభద్రగజపతి తన బలము నంతయు సమకూర్చి రాయలసైన్యము నెదిరింప దలపడెను. రెండు పక్షముల వారికి భయంకర సమరము జరిగెను. గజ