పుట:Andhraveerulupar025903mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పతుల సైన్యము చాలవఱకు నష్టపడెను. బయటనున్న బ్రాణములు దక్కవని వీరభద్ర గజపతి, వీరభద్రపాత్రుడు, రాచూరి మల్లాఖానుడు, ఉద్దండఖానుడు, రాచిరాజు శ్రీనాథరాజు, లక్ష్మీపతిరాజు, జన్యామలక సవాపాత్రుడు, బాలచంద్రమహాపాత్రుడు మున్నగు వీరులందఱు కొండవీటి దుర్గమునజేరి తలదాచుకొనిరి. బహిరంగస్థలమున నున్న గజపతిసైన్యమును దరుముకొనుచు శ్రీకృష్ణదేవరాయలు అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరము లోనగు దుర్గములన్నిటిని స్వాధీనపఱచికొనెను.

క్రీ.శ. 1515 సంవత్సరము మార్చినెలలో తిమ్మరుసు మంత్రి కొండవీటిదుర్గమును ముట్టడించెను. ఈవార్త ప్రతాపరుద్రగజపతి విని కొండవీటిదుర్గమును రక్షింపనెంచి మూడు వందల యేనుగులతోడను ఇరువదివేల యాశ్వికబలముతోను ఐదులక్షల కాల్బలము తోడను బయలుదేరెను. ఈ వార్త కృష్ణదేవరాయలు విని తిమ్మరుసుమంత్రిని గొండవీటిని ముట్టడించుటకు గొంతబలముతో విడిచిపెట్టి తాను సైన్యసహితుడై గజపతి సైన్యము నెదిరించుటకు గృష్ణదాటి మేడూరు వద్ద కేగెను. ప్రతాపరుద్ర గజపతి సైన్యమునకు శ్రీకృష్ణదేవరాయల సైన్యమునకు భయంకరసమరము కొంతకాల మెడతెగక జరిగెను. దురదృష్టశాలియగు గజపతియొక్క సైన్యము నశించెను. విఫలమనోరథుడై కొండవీటిపై నాశవిడిచి ప్రాణము