పుట:Andhraveerulupar025903mbp.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయలు తనదుర్గముమీదికి వచ్చెనని యుదయగిరి పాలకుడగు తిరుమలకాంతరాయడు విని వెఱగంది చేయునదిలేక యావర్తమానము ప్రతాపరుద్రగజపతికి దెలియ జేయ జారులనంపి పదివేల సైనికులను నాలుగువందలమంది యాశ్వికులను దుర్గమున జేర్చుకొని జాగరూకతతో సంరక్షించుచుండెను. తిమ్మరుసు రాయలును సైన్యమును బురికొల్పి యుదయగిరి దుర్గమును ముట్టడించిరి. కోటలోనున్నవీరులు గుహలోనున్న సింగములవలె బట్టుదల వదలక రాయల సైన్యముతో నిలుకడగ బోరాడుచుండిరి. దుర్గములోని కాహార పదార్థములు పోకుండ నరిగట్టినచో విరోధులు సులభముగా లోబడుదురని రాయలసైనికులు దుర్గద్వారములన్నియు దెఱువవీలుగానివిధమున గండశిలలతోమూసిరి. ఉదయగిరి దుర్గదుస్థ్సితి విన్నంతనే ప్రతాపరుద్రగజపతి లక్షసైనికులను కటకమునుండి తిరుమలకాంత రాయలకు దోడ్పడి ఉదయగిరి కాపాడుటకు బంపెను. ఈవార్త చారులవలన తిమ్మరుసుమంత్రి విని నాయసము కొండమరుసయ్యను కొంతసైన్యమును ఉదయగిరి జయించుటకు గృష్ణదేవరాయల యధీనమునందుంచి తాను వచ్చుచున్న సైన్యమునకు నెదురుగా సైన్యసహితుడై యేగెను. ఉభయదళములకు భయంకర సంగరము మార్గమధ్యమునందె జరిగెను. తిమ్మరుసు మంత్రి యీసంగరమున మగ్నుడై యుంట గమనించి కృష్ణదేవరాయలు విద్యానగరమునుండి కొంతసైన్యము వచ్చుట కాజ్ఞా