పుట:Andhraveerulupar025903mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు బాటుపడుచు దిమ్మరుసుమంత్రి యనుజ్ఞచొప్పున సైనికబలమును వృద్ధిచేసి తిరుగబడిన రాజుల వృత్తాంతములు చారులముఖమున గుర్తెఱింగి దండయాత్రలకు బలము సిద్ధ పఱచుచుండెను. ద్రవిడదేశము నంతటికి మువ్వురు ప్రతినిధులు నియమింపబడిరి. వారు సామంతులనుండి మూడుకోట్ల ద్రవ్యము సంవత్సరమునకు బ్రోగుచేసి పంపుచుండిరి.

ఇట్లు కృష్ణదేవరాయలు రెండు సంవత్సరములు రాజధానియం దుండి సైనికబలమును మిగుల నభివృద్ధిపఱచి దేశ పరిస్థితులు విశాలదృష్టితో నొక్కమాఱు పరికించెను. మహమ్మదీయ రాజ్యములు చీలికలుగ జీలి వానిలో వానికైకమత్యము లేకుండెను. వీనివలన మనకింతలో నపాయము కలుగదని నిశ్చయించెను. గజపతులు ఓడ్రదేశమునుండి బయలువెడలి కృష్ణా గోదావరుల దాటి బలవంతములగు దుర్గముల నాక్రమించికొనిరి. కొండవీటిదుర్గము, ఉదయగిరిదుర్గము, కనకగిరిదుర్గము గజపతుల స్వాధీనమునం దుండెను. అటు ద్రవిడ దేశమును ఉదయగిరియందుండియు, నిటుకర్ణాట దేశమును గొండవీటి నుండియు రెంటిక్షి నుమోడియు పకయున్న పశ్చిమాంధ్రదేశమును (నిజామురాష్ట్రమును) గొండవీటి దుర్గమునందుండియు జయించుటకు గజపతులు యత్నించుచుండిరి. కటకముమొదలు గోదావరి వఱకు గల దేశమంతయు గజపతులు ముందె యాక్రమించుకొనిరి. గజపతుల నిర్మింపకున్న నెప్పటికేని విద్యానగరసామ్రా