పుట:Andhraveerulupar025903mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలె విజయనగరప్రభువు తమపై నెపుడుపడునో యనిభయపడుచుండిరి. అన్నిచోటుల గలిసి విద్యానగరసామ్రాజ్య సైన్యము పదిలక్షలకు మించియుండెను. ఈసైన్యములో గొంతయు, ముప్పది యాఱువేలమంది యాశ్వికులు, ఏడెనిమిది వందల మంది గఝసైన్యపాలరులు విద్యానగరమును నిరంతరము గాచుచుండిరి. ప్రతిరాజ్యమునందలి రహస్యముల గుర్తుంఛి వచ్చుటకు నేర్పరులగు చారులు నియోగింపబడిరి.

కృష్ణదేవరాయలు రాజ్యమునకు వచ్చిన క్రొత్తలో గొంతకాలము విద్యావినోదములతో గడుపుచుండెను. ఆయన స్వయముగ గర్ణాటాంధ్ర సంస్కృతాది భాషలలో బండితుడును గవియు నగుటచే నాయాభాషలలో సుప్రసిద్ధులగు పండితుల గౌరవించి వారిచే గ్రంథముల రచింపజేసి సారస్వత మాధుర్యము చవి జూచుచుండెను. రాయల కభిమానభాష ఆంధ్రము. ఆంధ్రభాషలో గవితచెప్పు సుప్రసిద్ధకవుల నందఱను బిలువనంపి సత్కరించుటయే గాక తన యాస్థానము నందు అల్లసానిపెద్దన్న, ముక్కుతిమ్మన్న, మాదయగారి మల్లన, తెనాలి రామలింగకవి, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, పింగళిసూరన యను కవులను అష్టదిగ్గజము లను పేరుతో నుంచుకొని వారిచే జిత్రవిచిత్ర కావ్యములు రచింప జేసి సంతోషముగ గాలము గడపుచుండెను. ఇంతలో--------మత్యుడుగాక సామ్రాజ్య క్షేమము