పుట:Andhraveerulupar025903mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గా దెలియదు. రాయల కీమెయెడల ననురాగము మెండు. ఈమెపేరనాగాలాపురమను నొక పేట గట్టించి మనోహరమగునొక రాజవీధినందు నెలకొల్పెను. వివిధములగు సందు లా వీధిలో బెట్టించెను. ఆవీథులందలి యంగడుల సుంకము సంవత్సరమునకు నలువదిరెండువేల వరహాలను మించియున్నదని చరిత్రకారులు చెప్పుచున్నారు. శ్రీరంగపట్టణాధీశుడగు వీరశ్యామరాయల పుత్రికారత్నమగు తిరుమలదేవి రాయల రెండవ భార్య. ఈయమ రాయల కనుకూలవతియు బ్రేమాస్పదయు నై యుండెను.

కృష్ణదేవరాయలు సామ్రాజ్యమునకు వచ్చినది మొదలు అభివృద్ధిమార్గముల నన్వేషించుచు జుట్టుప్రక్కల బలవంతులై యున్న యవనులను బరాభూతుల జేయ యత్నించుచుండెను. సామంతప్రభువులు ప్రతిసంవత్సరము సుంకమునొసంగుటె గాక యవసరమైనపుడు కొంతసైన్యము నొసంగునటుల గట్టడిగావించెను. తనస్వాధీనములోనికి గ్రొత్తగావచ్చిన దుర్గములకు నధికారుల నియోగించి వారిచే సైనికబలమును అభివృద్ధి చేయించుటయేగాక తానుగూడ ధనము విరివిగా వెచ్చబెట్టి ఆశ్వికబలమును గజబలమును పదాతిసైన్యమును మిక్కిలి యభివృద్ధిలోనికి దెచ్చి బొక్కసము ధనముతో నింపివేసెను. ఆకాలమున రాయల సైన్యము అసంఖ్యాకము అపరిమితముగ నుంటచే సాటి రాజులందఱును అరజేతిలో బ్రాణములుంచుకొని సింహము