పుట:Andhraveerulupar025903mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యని పిలుచువాడు. రాయలు రాజ్యమునకు వచ్చినపిదప విద్యానగర సామ్రాజ్యమును కృష్ణదేవరాయలు తన యసాధారణ ప్రజ్ఞాతిశయముచే మిగుల విస్తర మొనరించెను. వీర నరసింహరాయలు విద్యానగరసామ్రాజ్యమును బాలించుకాలముననె కృష్ణదేవరాయలు పన్నులొసంగక తిరుగబడిన సామంతుల లో గొనుటకు దండయాత్రకు బయలు దేరి కర్ణాటకదేశమందలి ఉమ్మత్తూరు దుర్గమును మూడు మాసములు ముట్టడించి జయించెను. తరువాత కావేరితీరమున నున్న సుప్రసిద్ధమగు శివసముద్ర దుర్గమును ముట్టడించి జయించెను. శ్రీరంగపట్టణమును జయించి తన ప్రతినిధి నచట నిలిపి కృష్ణదేవరాయ లనతికాలములో విద్యానగరమునకు జేరెను. రాయల పరాక్రమజీవితము సుప్రసిద్ధ మగుటచే బూర్వసామంతులలో జాలమంది యెప్పటివలె గప్పము లొసంగుచుండిరి. కొందఱు బాలుడగు కృష్ణదేవరాయలను బాటింపక సుంకమునీయ మానికొనిరి. అందులకై యపరిమిత సైన్యముతో విజయయాత్రలకేగి దేశమునంతయు స్వాధీనపఱచికొన వలయునని సంకల్పించెను. ఈ సంకల్పమునకు దిమ్మరుసు మంత్రి పెక్కుభంగుల బ్రోత్సాహము గావించి నిజబలమును గోశాగారమును నభివృద్ధిపరచెను.

రాయలభార్యలలో జిన్నాదేవియు దిరుమలదేవియు సుప్రసిద్ధురాండ్రు. చిన్నమదేవి యేరాజపుత్రియో స్పష్టము