పుట:Andhraveerulupar025903mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిహరరాయల, బుక్కరాయల యనంతరమున విద్యానగరరాజ్యమును రెండవహరిహరరాయలు, దేవరాయలు(రెండవ) దేవరాయలు, మల్లికార్జునరాయలు, విరూపాక్ష రాయలు, (రెండవ) విరూపాక్షరాయలు పరిపాలించుచు వచ్చిరి. రెండవ విరూపాక్షరాయలు పరిపాలనమునం దనసమర్థుడును భోగలాలసుడు నగుటచే బ్రజ లీతని ద్వేషించిరి. ఏతద్రాజ్య దండనాథు:డగు సాళ్వనరసింహరాయ లీపరిస్థితులు గమనించి రాజును వెడలనడచి తానె విద్యానగరసంస్థాన ప్రభువై చిరకాలము పాలించెను. అతని యనంతరమున నిరువురు కుమారు లొకరివెంట నొకరు రాజ్యమునకువచ్చి యకాల మరణమొందిరి. తరువాత విద్యానగర సామ్రాజ్యమునకు తుళువనరసరాజు పరిపాలకుడయ్యెను.

నరసరాజు తరువాత నతనికుమారుడు వీరనరసింహరాయలు కొంతకాలము విద్యానగరసంస్థానము పాలించి మరణించెను. అనంతరము శ్రీకృష్ణదేవరాయలవారు (క్రీ.శ. 1509 ఫిబ్రవరి 4 వ తేది) విద్యానగర సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడయ్యెను. రాయలవద్ద తండ్రియగు నరసరాజుకాలమునుండి సుప్రసిద్ధుడై యున్న సాళువతిమ్మరసు మంత్రిగ నుండెను. తిమ్మరసు వయసున బెద్దవాడును దనకు విద్యాగురువును రాజకీయ రహస్యవేత్తయు నగుటచే కృష్ణదేవరాయ లాయనయెడల మిగుల గౌరవబుద్ధిగలవాడై అప్పాజి