పుట:Andhraveerulupar025903mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోవ నాయుధములు సర్పాకారముదాల్చి గుహలోనికి బోయెను. ఈపరిస్థితులు అపశకునములుగ నెంచి ప్రతాపరుద్రదేవుడు జయముపై నాసవీడి ఖడ్గముపుచ్చుకొని మహమ్మదీయ సైన్యముపై దుమికెను. అలూపుఖాను ప్రతాపరుద్రుని బంధించి రహస్యముగా దనశిబిరమున జేర్పించెను. రాజింక యుద్ధము చేయుచున్నాడని సైనికులు ఘోరముగ బోరాడుచుండిరి. అలూపుఖాను ఆరాత్రినుండియే సైన్యముతో ప్రతాపరుద్రుని డిల్లీకిబంపెను. ఎటులో నీవర్త ఓరుగల్లు నగరమునందంతటను బ్రాకెను. ఆంధ్రభటులు రాజునువిడిపింప శిబిరముల కడకుఱికి భయంకరసమరము చేయుచుండ మహమ్మదీయ సైనికులు కోటలు బగులగొట్టి ఆలయముల గూలద్రోచి రాజమందిరము అంగడి వీధులుదోచి డిల్లీత్రోవబట్టిరి. మహమ్మదీయ శిబిరములందు దమరాజు లేకుండుటకు వగచి డిల్లీకి గొనిపోవుచుండిరేమో త్రోవలో నడ్డగించి రాజును విడిపింతమని యవనసైనికులు పోయిన త్రోవనుబట్టి యాంధ్రులు రామగిరియొద్ద ప్రతిపక్షసైన్యమును గలసికొని ఘోరసంగరమునకు దలపడిరి. ఆంధ్రసైనికులు రాజును విడిపించుటకు భొవుచున్నారని విని ఓరుగల్లు ముట్టడించు మహమ్మదీయ సైనికులు రామగిరివద్ద తమసైన్యములను గలిసికొని ఆంధ్రసైనికులతో బోరుచుండ యుక్తిశాలియగు నొక మహమ్మదీయసేనాని కొంత పరిజనముతో రాజు నీసంరంభములో గోదావరి దాటించెను. ఆంధ్రసైనికులు