పుట:Andhraveerulupar025903mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుల్తాను, చుట్టుపట్టులనున్న చందేరీ, బూదావూన్, మాళవదేశములనుండి తక్షణమె యసంఖ్యాక సైన్యమును రప్పించి యలూపుఖానున కొసంగి త్రిలింగసామ్రాజ్యమును హరించి రాజును బంధించిగాని నాయొద్దకు రావద్దని పంపెను. యవన సైన్యము రాత్రుల నడవిత్రోవల బయనము చేసి ఆకస్మికముగా నోరుగల్లుకోటమీదపడి నిర్భయముగా నసహాయముగానున్న ద్వార రక్షకసైన్యమును దెగటార్చి లోనికిజొచ్చెను. యుద్ధముముగిసి రెండునెలలైన గాలేదు. ఇంతలో యవనులవలన నెట్టి యుపద్రవముండదని వీరులకు విశ్రాంతి యొసంగి ప్రతాపరుద్రుడు పరిమితబలముతో నగరమధ్యమునందలి మహాసౌధమున నుండెను. యవనసైన్యము ఱాతికోటకు ఫిరంగులు బారు పెట్టికాల్చుట లాంధ్రసైనికులు విని నివ్వెఱపోయిలేచి దుర్గరక్షణమునకు బూనుకొనిరి. యవన సైనికులుకోట బైటిద్వారములన్నిటిని మూయించి క్రొత్తసైన్యము నగరము జేరకుండ కట్టుదిట్టముచేసి రాతికోట బగులగొట్టనారంభించిరి. ప్రతాపరుద్రచక్రవర్తి యేనుగునెక్కి సైనికుల బురికొల్పుచు బ్రతిపక్ష సైన్యమును బంచబంగాళము చేయించుచుండెను. ఆంధ్రసైనికులు పరాజయమందుచుండిరి. ప్రతాపరుద్రు డీవిపరీత పరిస్థితులగాంచి స్వయంభూ దేవాలయమున కేగి జ్యోతిర్లింగమును సందర్శించిన నది ప్రకాశవంతముగ గోచరింపదయ్యె. పద్మాక్షియాలయమునకేగి యాయుధములటనిడి నమస్కరింప