పుట:Andhraveerulupar025903mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేతములుగ నుత్సవములచే నలరారుచుండెను. కొలది కాలములో ఆంధ్రసామ్రాజ్యము మహోన్నతదశకుకు వచ్చెను.

ఇంతలో డిల్లీరాజ్యమున బెక్కువిప్లవములు జరిగెను. అల్లాఉద్దీను గతించెను. డిల్లీసామ్రాజ్యసామంతులు తిరుగబడిరి. దేవగిరియాదవులు స్వతంత్రులైరి. ప్రతాపరుద్ర చక్రవర్తి గూడ పన్నుకట్టుట మానికొనెను. మల్లికాపూరు సింహాసన మెక్క విశ్వప్రయత్నముగావించెను. ఆతని వధించిరి. తరువాత ముబారకు అనుపేరుగల అల్లాఉద్దీను రాజ్యమునకు వచ్చి దేవగిరి మీదికి దండయాత్రకేగి దుర్గాధిపతియగు హరిపాల దేవుని నోడించి రాజ్యమధ్యమున బ్రతికియుండగ మిగులక్రూరముగ నతని మేనితో లొలిపించెను. ముబారకు రాజ్యమునకు జేరగనే ఖుస్రూఅను సేనాధిపతి వానిని జంపించి తాను రాజయ్యెను. తరువాత నైదు మాసములకు ఘాజీబేగుతుగ్లక్ ఖుస్రూను సంగరరంగమున జంపి ఘియాజుద్దీను తుగ్లక్ అనుపేరుతో క్రీ.శ. 1321 ఆగష్టు 22 తేదిని డిల్లీసామ్రాజ్యమునకు రాజయ్యెను. ఇతడు రాజనీతివిదుడగుటచే నలువైపుల నుండి శత్రుసైన్యములు రాకుండ కట్టుదిట్టములు చేయించెను. ప్రతాపరుద్రుడు పూర్వవైరము పురస్కరించుకొని డిల్లీ సామ్రాజ్యమును మ్రింగివేయునేమో యను భయమాతని హృదయమును దహించివేయుచుండెను.