పుట:Andhraveerulupar025903mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ని సేనానాయకుడును రేచర్ల గోత్రుడునునగు ఎఱ్ఱదాచానాయకుడు కాంచీపురరాజ్యము కాకతీయులవశము గావించెను. కులశేఖరవర్మ తరువాత కాంచీరాజ్యమును హరింప ముప్పడి నాయకు డేగి యాతనిజయించి తెలుగు చోడులలో నొకడగు మానవీరుని సింహాసనమున జేర్చెను. చిన్నచిన్న రాజ్యములు గూడ దిరుగబడుట చూచి స్వయముగా దండయాత్ర చేయకున్న వీలుగాదని దుర్గరక్షణమునకు వలయు బలమును ఆంధ్రనగరమునందుంచి యపరిమిత బలముతో బ్రతాపరుద్ర చక్రవర్తి దండయాత్రకు బయలుదేరి పాండ్య, కొంకణ, తెంకణ, మలయాలాది పశ్చిమదేశాధీశ్వరుల నంకితులుగ జేసికొని పుణ్యక్షేత్రముల దర్శించి మణి మాన్యాదికము లొసంగి ఓరుగల్లు చేరెను. పూర్వముకంటె దృడతరముగ దుర్గమును బాగుచేయించి కందకమును విశాలముచేయించి యాంధ్రనగరమును శత్రుజనాభేద్య మొనర్చెను. శైవమతాభిమానియై బ్రాహ్మణోత్తములకు బెక్కు వృత్తులనొసంగి కవుల బహూకరించి యుత్తమకావ్యముల రచింప బ్రోత్సహించి తటాకముల నభివృద్ధిపఱచి రాజ్యము రామరాజ్యమ గావించెను. నాడు నిర్మింపబడిన కాకతమ్మబావి, శోభనాల బావి, సవతుల బావి, గడియారముల బావి, కుషిమహలు, ఏకశిలామహలు లోనగు కట్టడము లాంధ్రవీరుల శిల్పిప్రశస్తికి దార్కాణముగ నేటి కలరారుచు నేత్రపర్వముగ నున్నవి. కేశవాలయము, స్వయంభూదేవాలయము మిగుల వైభవో