పుట:Andhraveerulupar025903mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకస్మికముగ నున్నటులుండి యవనులు ఏనుగుల సహాయముతో నగడ్తదాటి యర్థ రాత్రమున మంటికోటనెక్కి లొనున్నపౌరులను సైనికులను హింసింప దొడంగిరి. తెల్లవారు వఱకు ఱాతికోటవఱకు మహమ్మదీయ సైన్యములు వచ్చెను. అగడ్త వారి నాటంకపఱచెను. అగడ్త పూడ్వసాగిరి. పైనుండి యాంధ్రసైనికులు ఆగ్నేయాస్త్రములు, ఆయుధవర్షము గురిపించి యవనదళము జెండాడుచుండిరి. తగనిపట్టుదలతో యవనవీరులు ఱాతికోటకు బగ్గమువేసి ప్రాకుచుండిరి. ప్రతాపరుద్రదేవు డీవార్త నాలించి యిక విజయము దుర్లభ మని తలంచి యాంధ్రుల దురదృష్టమునకు గాలమే కారణమని సంధికియ్యకొనెను. మధ్యవర్తులు సంధికి రాయబారముల నడిపిరి. ప్రతాపరుద్రుడు 312 ఏనుగులు, 20,000 గుఱ్ఱములు 96,000 మణుగుల బంగారము, పెట్టెడు రత్నములు నొసంగి డిల్లీసామ్రాజ్యమునకు బన్నుకట్టుట కొప్పుకొనెను. మల్లికాపూరు జయమును గడించి 1310 సంవత్సరము మార్చి 19 వ తేదిన డిల్లీ సామ్రాజ్యాభిముఖుడై హతశేషసైన్యముతో వెడలి పోయెను.

ఓరుగల్లురాజ్యమును మహమ్మదీయులు ముట్టడించిరనియు బ్రతాపరుద్రుడు సంధి కియ్యకొనెననియు విన్నంతనె సామంతులలో బెక్కండ్రు తిరుగబడి కప్పములీయ వద్దని నిశ్చయించిరి. కాంచీపుర పాలకుడు స్వతంత్రత బ్రకటింప బ్రతాపరుద్రు