పుట:Andhraveerulupar025903mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిరిని ముట్టడించి రామచంద్రదేవుని బంధించి డిల్లీకిబంపి యచటిబలము నంతయును హరించి ఏకశిలానగరముమీదికి దాడి వెడలెను. కాని తీరని పరాజయము నొంది యవనసైనికులు చిందరవందరయై బ్రదుకుము జీవుడాయని ఇంటిత్రోవబట్టిరి. పరుష స్వభావముతో నీయవనసైనికులు ఆంధ్రదేశమున బ్రవేశించినపుడును బారిపోవునపుడును. గూడ ఆలయముల రూపుమాపి నగరములను గాల్చి దీనుల హింసించి ప్రజాపీడ సమకూర్చిరి. ఆంధ్రసామ్రాజ్యమంతయు యవన దురంతములచే గల్లోలమై క్షోభనొందెను. నష్టపడిన ప్రజలందఱకు బ్రతాపరుద్రుడు బొక్కసమునుండి ధనము తెప్పించి యొసంగి వారి యాపత్తుల జాలవఱకు నివారించెను.

క్రీ.శ.1319 సంవత్సరమున అల్లాఉద్దీను మూడవ పర్యాయము ఆంధ్రసామ్రాజ్యమును జయించుటకు మల్లికాపూరు, ఖ్వాజాహాజీయను వారల యధ్యక్షతక్రింద నపరిమిత సైన్యమును నొసంగి పంపెను. దేవగిరిచెంత నెట్టిప్రతిఘటనను లేకుంటచే యవనసైన్య మాకస్మికమున ఇందూరు మీదుగా వచ్చుచుండ స్వామిభక్తపరాయణులగు సైనికు లెదిరించి వీరమరణమొందిరి. మహమ్మదీయులు సిరిపురదుర్గమును ముట్టడించిరి. దుర్గపాలకుడగు వాణీకవిదేవుడు భయంకరసంగ్రామ మొనరించి యవనసైనికుల యాగ్నేయాస్త్రములకు గుఱియై అవరోధకాంతలతో గూడ దగ్థమయ్యెను. అతని సోదరుడు