పుట:Andhraveerulupar025903mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైన్యమునుజెండాడి విజయలక్ష్మీద్వితీయులై యాంధ్రసైనికు లేకశిలానగరము జేరిరి. పరాభవదు:ఖముతో హతశేషమగు సైన్యమును సమకూర్చుకొని మల్లిక్ కాపూరు డిల్లీకి జేరెను.

రణమున జయించి సైన్యమును జెండాడి నగరమున కేతెంచిన యాంధ్ర వీరులనందఱను బ్రతాపరుద్ర చక్రవర్తి గౌరవించి యుచిత సత్కారములగావించి గౌరవించెను. ప్రజలు తమ సామ్రాజ్యజయమున కానందించి వీరులకు హారతులొసంగి మహోత్సవము లొనరించి మృతవీరుల పొలికలనిలో స్మరణ చిహ్నముల నెలకొల్పిరి. ఏకశిలానగర రాజ్యమును గబళింప నెంచిన త్రిపురాంతకుడు అంబయదేవుడు ప్రతాపరుద్రుని వంచింప నిదియ తరుణమని యోరుగంటికోటపైకి వచ్చిరి. సోమయగన్నవీరు డపరిమిత సైన్యబలముతో వారి నెదిరించి సైన్యసహితముగ దునుమాడి వారిరాజ్యము నాంధ్రసామ్రాజ్యములో గలిపివేసెను. యవనసైన్యము డిల్లీకేగినది మొదలు అల్లాఉద్దీను ఆంధ్ర సామ్రాజ్యమును హరింపనైతినే యనిమిగుల నాందోళనపడి యచిరకాలమున మఱల దండయాత్ర కేగనిశ్చయించి సైనిక బలమునభివృద్ధి జేయుచుండెను. అపుడు దేవగిరిని డిల్లీకంకితుడై పాలించు మహారాష్ట్రుడగు రామదేవుడను నామాంతరముగల రామచంద్రదేవుడు డిల్లీసామ్రాజ్యమునకు బన్నునొసంగమానెను. అల్లాఉద్దీను రెండవదండయాత్ర కాంధ్రకోశముమీదికి మల్లికాపూరునుబంపెను. అతడు తొలుత దేవ