పుట:Andhraveerulupar025903mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాపూరు పదివేల గుఱ్ఱపుదళము నలుబదివేల సైనికులతో బయలుదేరి దేవగిరిచేరి యంతకుమున్ను యంకితుడైన రామదేవునియొద్ద నాతిధ్యముల గైకొని ఆంధ్రనగరము మీదికి బయలువెడలెను. ఈవార్త ప్రతాపరుద్రదేవుడు వినినంతనె యవనసైన్యమునకు బరాభవము సులభముగ జేయవచ్చునని పాండ్య చోళ కేరళదేశములపైకి బోవ సర్వసిద్ధముగా నున్న యాత్మీయసైన్యమునకు దన తమ్ముడగు అన్నమదేవుని యధ్యక్షుని గావించి యెదిరింపబంపెను. పురవరి మహాదేవనాయకుడు, సాహిణిమారుడు, మేచయనాయకుడు బెండపూడి అన్నయమంత్రి, ముప్పడినాయకుడు లోనగు మహావీరులకు గొంతబలము నొసంగి తాను గోదావరీతీరమువఱకు యవనసైన్యము నెదిరింపనేగెను. ఆంధ్రసైనికులు మహమ్మదీయ సైన్యమును గోదావరి దాటకుండ బెక్కువిధముల నరికట్టిరి. పడవలలో వచ్చుసైనికులను సుడిగుండములలో గూలద్రోసిరి. పడవలు బగులగొట్టిరి. ప్రాణములకు దెగించి హతశేషులగు యవన సైనికులు గోదావరి దాటి యీవలకు వచ్చినంతనె ఆంధ్రమహమ్మదీయ సైన్యములకు మహాసమరము జరిగెను. ఆంధ్రవీరులు మొక్కవోని పరాక్రమమున ముందున కుఱికి యవన సైన్యము నంతయు జిందరవందర గావించి రణరంగము నంతయు బ్రతిపక్ష రక్తప్రవాహములతో నించిరి. ప్రాణముల మీది యాసతో జెట్టునకొకరు గుట్టకొక----------విడిచి మైమఱచి తురు: