పుట:Andhraveerulupar025903mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేరళ దేశాధిపతుల జయింపనెంచి కోటలు కొత్తళములు బాగుచేయించి సైన్యమును మిగుల వృద్ధికిదెచ్చెను. ఆ తరుణమున దేవగిరిదుర్గమున యాదవవంశజుడగు రామదేవుడు పాలించుచుండెను. ఇతడు భోగలాలసుడై కాలము గడుపుచు రాజ్యవ్యవహారములలో నంతగ జోక్యము పుచ్చుకొనకుండెను. ప్రతాపరుద్రుని త్రిలింగసామ్రాజ్యము మహోన్నత దశలోనుండుటచే నుత్తరహిందూస్థానమును బాలించు మహమ్మదీయ నృపాలురకు దేవగిరిని లోగొని యాంధ్రసామ్రాజ్యమును హరింపవలెనను కోర్కి జనించెను.

డిల్లీ సామ్రాజ్యమును జలాయుద్దీను ఫిరోజు పాలించు కాలమున అల్లాఉద్దీను అపరిమితసైన్య సహాయముతో నొకమాఱు దండయాత్ర కరుదెంచి దేవగిరిని ముట్టడించి జయించి రామదేవునివలన గొంతధనము, అమూల్యరత్నములు, బంగారము గైకొని సామంతునిజేసికొని వెనుకకు మఱలెను. ఆంధ్ర సామ్రాజ్యముగొప్పతన మపు డతడు వినెనుగాని సైన్యమలసి యుండుటచే ముందునకేగ మానెను.

అల్లాఉద్దీను తన మేనమామయగు జలాలుద్దీను ఫిరోజును జంపి తాను క్రీ.శ. 1296 లో బ్రభువయ్యెను. ఇతడు ఓరుగల్లు రాజ్యమును జయింపనెంచి సైనికబలమును ఆయుధసామగ్రిని మిగుల నభివృద్ధిపరచి క్రీ. 1303 లో మల్లిక్ నాయబ్ కాపూరనువాని సేనాధిపతిగ నొనర్చిపంపెను. మల్లిక్ నాయబ్