పుట:Andhraveerulupar025903mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కన తన భార్యను జూచి యదియేమని యడుగ సంగరము నుండి పాఱివచ్చిన భర్తలను వీరపత్నులు గౌరవింపదగిన విధమిదియెకదా? యనిప్రత్యుత్తర మొసంగెను. తన ప్రమాదమునకు దాను నొచ్చుకొని యెటులోస్నానము గావించి ఖడ్గతిక్కన భోజనగృహములోని కేగెను. తల్లి ప్రోలమాంబ అన్నము వడ్డించెను. కుమారుడు భుజించుచుండెను. మజ్జిగకు మాఱుగా తల్లి పాలు వడ్డించెను. అవి విఱిగిపోయియుంటచే నిటులున్న వేమి యని ఖడ్గతిక్కన తల్లినడిగెను. ఆమె పక్కున నవ్వి "విరోధులను జయింపలేక పందవై నీవు వచ్చుటచే బశువులు విఱిగినవి, పాలును విఱిగె"నని చెప్పెను. ఆమాటవిని యెటులో భోజనవ్యాపారమును ముగించి ఖడ్గతిక్కన పరాభవ దు:ఖము నిష్ఠురోక్తులవలని రోసము మదిలో నుంచుకొని "జయించి విక్రమసింహపురమును జేరవలయును, లేదా సంగరమందె మరణింపవలయును. ఇదియె నా ప్రతిజ్ఞ"యని పలికి రాజమందిరమున కేగి క్రొత్తసైన్యమును దనవెంట గైకొని రివ్వున సంగ్రామరంగము చేరెను.

ఖడ్గతిక్కన సైన్యసహాయుడై సంగరరంగము నలంకరించుచున్నాడని యాదవు లాలించి వారును రణరంగము నలంకరించిరి. ప్రళయకాల నటునివలె విజయముపై లక్ష్యముంచి నిశ్చలముగా బోరాడు ఖడ్గతిక్కనవిక్రమమునకు వెఱచి సైనికులు త్రోవనీయసాగిరి. కాటమరాజు సైన్యము