పుట:Andhraveerulupar025903mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయడు మలిదేవాదులముందు బెట్టి నాధర్మము నిర్వహించితినని చెప్పెను. కొమ్మరా జాతలను బరిశీలించి 'యిది నరసింహరాజు తలకాదు. నరసింహరాజును జంపవలసిన భారము బాలునిపైననే గల' దనిచెప్పెను. వెంటనే మిత్రులను పరిజనులను వెంటగొని లేడిపైకిదుముకు సింగపు గొదమవలె విరోధులమధ్య దుమికెను. సేదదీర్చుకొని నరసింహరాజు బాలచంద్రు నెదిరించెను. కర్ణార్జునులవలె నీ వీరులిద్దరు చాలసేపు పోరి, నరసింహరా జలసిపోయెను. బాలుడు నరసింహరాజెక్కిన యేనుగుతుండమునొక చంద్రవంక బాణముతో నఱకెను. ఏనుగు ముందునకు మొగ్గెను. బాలుడు ఏనుగు కుంభస్థలము మీదినుండి పైకెక్కి నరసింహరాజును క్రింది కీడ్చుకొనివచ్చి కత్తితో గుత్తుక గోసి బల్లెముచివరి బెట్టుకొని వెంట తమ్ములు జయవాక్యములు పలుకుచుండ బెదమలిదేవుని కొలువుకూటమున కా తల జేర్చెను. వీరు లందఱు బాలచంద్రుని పరాక్రమమునకు హర్షించిరి. తన యన్న చావునకు బెదమలిదేవాదులు వగచిరి. నేను చేతి మీదుగ బెంచిన నరసింహరాజున కెంతటి దుర్గతి. కుమారునివలన గలిగెనని బ్రహ్మనాయడు పలవించెను. తరువాత విచారము కోపముగా మాఱి తనయునిజూచి, బాలుడా! నిన్నీ సంగరమునకు బిలిచిన దెవరు? పిన్నవాడవని యుపేక్షింప బిడుగుతునుక వైతివే! యని బ్రహ్మనాయడు నొవ్వ