పుట:Andhraveerulupar025903mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాడెను. బాలు డామాటకు గోపించి, 'తండ్రీ! నాడు పుత్రదు:ఖముతో నున్న కొమ్మరాజు నోదార్చి నన్నాయన చేతిలో బెట్టి యలరాజును జంపిన నరసింగరాజును బాలుడు చంపగలడంటివి. నాధర్మము నేను నెఱవేర్చితిననెను. బ్రహ్మనాయడు బాలచంద్రునిజూచి ఒక్కవీరుని జంపినంతనే శూరుడవైతివా? అరులకు వెన్నుజూపి పాఱివచ్చితివి గదాయని యెత్తిపొడిచెను. బాలచంద్రునియొడలు మండిపోయెను. విరోధిసైన్యమును జక్కాడి రాజుతల తెచ్చినందులకు వెన్నుజూపి వచ్చితినని కన్నతండ్రియే నొవ్వనాడినాడు. ఇక గదనమునుండి వెనుకకు బ్రాణములతోరాను. ఇదియె నాప్రతిజ్ఞయని బాలుడు నవయస్కులగు మిత్రులతో గదనరంగ మలంకరించెను.

'చిన్నవాడు గాడురాచిచ్చులపిడు'గని బాలునివిరోధులందఱు చుట్టుముట్టి వివిధాస్త్రములచే నొప్పించిరి. మొక్కబోని పరాక్రమమున బాలచంద్రుడు ముందునకు నడచుచుండెను. అభిమన్యుడు పద్మవ్యూహము భేధించినటుల బాలుడు విరీధిబలముల జించి చెండాడెను. కొంతసేపటికి విరోధులు చెలరేగి కమ్మర కాచెన్నను గడతేర్చిరి. మంగల మల్లును మది యించిరి. చాకలచందును జంపిరి. కుమ్మరపట్టిని గూల్చిరి. వెలమదోర్నిని చత్రవధ చేసిరి. బాలచంద్రుడు తన సైన్యమునంతయు నొకమాఱు పాఱజూచెను. మిత్రులందఱు మరణించిరి.