పుట:Andhraveerulupar025903mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారికి దరువాత శంఖముతో దీర్థమునొసంగి వీరగంథము మేనబూసి వీరతాంబూలము లొసంగి యుద్ధరంగమునకు సాగనంపెను.

రెండుపక్షములవారు భయంకరసంగరమునకు దారసిల్లిరి. రక్తము ప్రవహించెను. అనేకులు వీరులు వీరమరణ మొందిరి. ఒకప్రక్క నాయకురాలు, వేరొకప్రక్క నరసింగ రాజు బాలచంద్రుని బలమును జుట్టుముట్టిరి. కమ్మర కాచెన్న, మంగల మల్లు, చాకల చందు, కుమ్మర పట్టి, వెలమ దోర్నీడు, కంసాల చందులను బిలిచి వారివారి స్వాధీనమున గొంతసైన్యముంచి విరోధిసైన్యమును ఆవరించి రూపు మాపుట కన్నిదిక్కులకు బంపించెను. బాలచంద్రుడు స్వయముగా గొంత బలముతో నరసింగరాజు నెదిరించెను. నలగామరాజు మంచెపై నెక్కి తన బలము చెందు వినాశనమునకు బరితపించుచు, బ్రోత్సాహవాక్యములు పలుకుచుండెను. మలిదేవాదులు, బ్రహ్మనాయకాదులు బాలచంద్రుని యుద్ధ కౌశలమును వేయినోళ్ళ బ్రశంస చేయుచుండిరి. నరసింగరాజు బాలచంద్రుని ధాటికాగలేక వేఱొకత్రోవకేగి హతశేషమగు సైన్యమును సంగరమునకు బురికొల్పుచుండెను. తన ముందటనున్న మత్తగజముపై నెక్కినవీరుని నరసింహరాజని తలంచి బాలచంద్రుడు కుప్పించి ముందునకు దుమికి యేనుగుమీదివానిని గ్రిందికిలాగి వానితల జెండాడి తన బల్లెమునకు గ్రుచ్చుకొని తీసికొనిపోయి బ్రహ్మ