పుట:Andhraveerulupar025903mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిలిచి చెప్పెను. ఇంతలో నొకయువతి బాలచంద్రునివద్దకు వచ్చి అయ్యా! నేను మాడచి యనుదానను, మేడపిలో అంతిపురి కాపాడుదానను. నీవు రావి చెట్టునకు గట్టిన చీటి చదివి యుద్ధమునకు బాలుడు రావద్దనినాడు. నేను బ్రతికి లాభమేమని అనపోతు మెడగోసికొని మరణించుచు నీకిమ్మని వీరకంకణము జందెము ఇచ్చినాడు. అనపోతుభార్య సహగమనము చేసెనని చెప్పి కంకణము జందెము నొసంగెను. బాలచంద్రున కొడలెఱుగనంతటి యావేశమువచ్చెను. వీరకంకణము చేతికి ధరించుకొని జందెము మెడలోవేసికొనెను. అనపోతూ! మిగిలిపోకుము. నిన్ను స్వర్గమునకు జేరులోగ గలిసికొందునని బాలుడు పలికి సైనికుల నందఱను సంగరమునకు బురిగొల్పెను. నేను బాలుడనని మీరుసంకోచింపకుడు. ఒకప్పుడు నేను కుమారస్వామిని, ఇంకొకప్పుడు నేను అభిమన్యుడను. వేఱొకప్పుడు నేను సిరియాళుడను. దేహములు నశించుచున్నవిగాని ఆత్మ నశించుటలేదు. వీరునకు సంగరమరణమును బోలిన దింకొకటి లేదు. యుద్ధరంగమునకురండు. ఆలసింపకుడని బాలుడు పలికి యుద్ధమునకు త్రోవదీసెను. భోజనము చేయుచున్న వీరులందఱు విస్తళ్లు నాగులేటిలోవైచి ముందునకు దుమికిరి. ఈసంబరముజూచి యెదుట పక్షమువారు సిద్ధపడిరి. భగవంతునకుగూడ సంగరమిష్టము వలె నున్నది. చెన్న కేశవుని యనుగ్రహమెటులున్న నటులె జరుగునని బ్రహ్మనాయకుడు బాలచంద్రునకు ముందు, దక్కిన