పుట:Andhraveerulupar025903mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజును బాలుడు గుర్తించెను. కొదమసింగమువలె గుట్టపై నుండి విరోధిసేనమీదికి బాలు డుఱకబోవ మిత్రులు వారించిరి.

బాలచంద్రుడు గుట్టదిగి పెదమలిదేవుని శిబిరమునకు జేరబోవ గండుకన్నమనీడు వారించెను. త్రోసికొని రాజును సమీపించి, రాజా! సంధికి రాయబారముల కిది యదనుగాదు వనవాసములచే మీహృదయములు నీరసమైయున్నవి. దేహము శుష్కించినది. పరాభవ దైన్యముచే దలవ్రాలినది. ఇంక నేమని రాయబారములు చేయుచున్నారు, విరోధులను రణరంగమున బొరిగొనుటో మరణించుటయో మనవిధి. ఇదుగో! నేను రణరంగమున కుఱుకుచున్నాను. రాదలచినవారు రండు. లెండని బాలచంద్రుడు వైరిశిబిరముల కభిముఖముగా బోవ సమకట్టెను. కొమ్మరాజను నొక వీరుడు బాలునాపి వీర కుమారా! తొందరపడకుము. నా తనయుని నరసింహరా జక్రమముగా రాయబారమునకు బోవ జంపినాడు. నీవు వానిని జంపి నాకు శాంతిగూర్చెదవని నమ్మినాడను. కోపముతో గార్యముగాదు. కొలదిసేపులో సంగ్రామము కట్టాయితము కాగలదు. ఉపాయము లేనిది వైరిచిక్కడు. అని చెప్పుచుండు నంతలో రెండుపక్షముల వారికి సంధి కుదిరినది. యుద్ధప్రయత్నములింక నవసరములేదని పెదమల్లదేవుడు తన సేనామధ్యమున