పుట:Andhraveerulupar025903mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుని గౌగిలించుకొని 'తండ్రీ యుద్ధప్రయత్నము మానవా?' యని బ్రతిమాలెను. బాలచంద్రు డెంతకు వినడయ్యెను. కడకు ఐతాంబ ధైర్యము తెచ్చుకొని 'నేను మాత్రము వీరకాంతను కానా? నాభర్త వీరపత్ని బిరుదము, నా తనయుడు వీరమాతృబిరుదము నాకు బ్రసాదింపుచుండ జేజేత బోగొట్టనగునా' యని బాలచంద్రునకు బెరుగుతో నన్నము కలిపిపెట్టెను. బాలచంద్రుడు భోజనానంతరమున వీరవేషము దాల్చి తల్లికి నాయనమ్మకు నమస్కరించి వారి దీవనలనంది కదనరంగమునకు బయనమయ్యెను. పూర్వోక్తమిత్రులందఱు బాలచంద్రునితో సంగరమునకు బయలుదేరిరి. బాలుడు అనపోతును వెనుకకు బంపదలంచి కత్తియును డాలును ఉంగరమును మంచాలవద్ద మఱచివచ్చితిని. పరిచితుడవు నీవెపోయి దెమ్మనెను. అనపోతు పోకతప్పినదికాదు. అతని బోవనిచ్చి బాలుడు ఒకతాటియాకుమీద నేదియోవ్రాసి రావిచెట్టు కొమ్మకుగట్టి త్రిపురాంతకము, ముటుకూరు, గరికపాడు, మేళ్ళవాగుగ్రామములు దాటి బాలుడు పరిజనముతో వచ్చుచుండ మధ్యగ్రామములవా రీ వీరపుత్రుని గౌరవించిరి. తరువాత కనుమవద్దకు వచ్చువఱకు నాయకురాలు త్రోవగాచియుండెను. బాలుడు వేఱొకత్రోవను బయలు దేఱి నల్లగొండ నత్తమువకు మిత్రులతో నెక్కెను. గుట్టమీదనుండి నలగామ రాజుబలమును సేనానాయకులను శిబిరములను జూచెను. మంత్రిణియగు నాయకురాలిని సర్వసేనాధిపతియగు నరసింగ