పుట:Andhraveerulupar025903mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వొంది సంగరరంగ మలంకరింపుమని బాలచంద్రునకు జెప్పిరి. బాలచంద్రుడు సంతసించి కామవశమున గదనప్రయత్నమే మానుదునేమోయని వెంట బ్రాహ్మణ బాలుడగు ననపోతు నుంచుకొని యత్తవారింటికి బయలుదేరెను. వీరమేడపిలోనె మఱియొక వీధి బాలునియత్తవారిల్లు. పెండ్లి జరిగి యెన్నియో దినములు కాలేదు. నాడు పెండ్లిపీటలమీద సిగ్గుతో నేమి చూచెనోగాని బాలచంద్రు నాతనిభార్యయగు మంచాల తేరి పాఱజూచి యెఱుంగదు.

మంచాల అర్ఘ్యపాద్యాదులొసంగి యుచితవిధిని దన భర్తను, అనపోతుని బూజించెను. దంపతు లొకరినొకరు ప్రేమ పూర్వకములగు చూపులతో జూచుకొనిరి. అనపోతు తానీ సమయమున నచటనుంటకియ్యకొనక, 'మిత్రమా! బాలచంద్రా! ఏడుగడియలలో రావలయును., నేను ద్వారముకడ వేచియుందు'నని వెడలిపోయెను. బాలచంద్రుడు తాను నగరమున కేగుచుంటినని మంచాలకు జెప్పెను. ఆమె భర్త నాదరించి 'నాకు వీరపత్నియను పతివ్రతానామము సమకూర్చితివి. ఇంత కంటె నాకు గావలసినది ఏమియున్నది. ఇదుగో ఖడ్గము దీనితోవిరోధుల సంహరించి జయము సాధింపుము. బ్రాహ్మణులు ధర్మపరిపాలకులు. వారిని గాపాడుట రాజధర్మముగాన 'అనపోతును సంగరమునకు గొనిపోకుము. ఒక వేళ నాతడు సంగరమున మరణించిన బ్రహ్మహత్యాపాపము వచ్చునని వా కొనెను. బాలచంద్రుడు తన భార్యవద్దను అత్తయగు రేఖాంబవద్దను సెలవుగెకొని యింటికివచ్చెను! తలి కుమా