పుట:Andhraveerulupar025903mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీతండ్రి యెటకేగినది నాకు దెలియదనెను. బాలుడు కోపించి, నేనెఱుంగ ననుకొంటివా? నాతండ్రియు బెదమల్ల దేవాదులు కారెమపూడివద్ద యుద్ధముచేయుటకు బోయిరి. తండ్రికి రాజునకు దేశమునకు గానికొడుకు కొడుకా? నే నిక నిట నుండజనదు. యుద్ధమున కేగెదనని పయనమునకు సిద్ధపడెను. ఐతమ్మ యెన్నివిధములనో నయమున భయమునం జెప్పెను. లాభము లేకపోయెను. నాయనమ్మ మాట వినునేమో యని తల్లి తన యత్తగారగు శీలమ్మను బిలిచెను. ఆమె మాటలు బాలచంద్రుడు నిరాకరించెను. జ్యోతిశ్శాస్త్రపండితుల బిలువనంపి బాలుని జాతకము జూప ఇక పదునైదు దినములలో నితనికి గొప్ప గండగలదని సంకోచించుచు జెప్పిరి. యుద్ధరంగము భయంకరముగా నుండునని చెప్పి శీలమ్మయు ఐతమ్మయు బాలుని భయపెట్టిరి. చావునకు దెగించిన బాలవీరునకు సంగ్రామరంగముకంటె సౌఖ్యకరమైన ప్రదేశములేదని బదులుచెప్పెను. ఐతమ్మ కన్నీరు నించుచు నాకు గడుపుశోకము పెట్టుదువా? యని వాయెత్తియేడ్చెను. బాలచంద్రుని హృదయము మఱింత మొద్దుబాఱెను. తాను వీర మరణమునకు సిద్ధముగా నున్నాడననిచెప్పెను. ఐతమ్మయు శీలమ్మయు యోజించి బాలుని ప్రయత్నము ఆపుట యసాధ్యము. ఐనను చేయగల యత్నములు చేయవలయునని రూపవతియగు భార్యను జూచియేని కామపరవశమున గదనము మానునేమో యనుకొని నీభార్యయగు మంచాలవద్ద సెల