పుట:Andhraveerulupar025903mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందె యాప్రదేశమునిండ రత్నకంబళములు, చాపలు పఱచిరి. బాలురంద ఱచట గూర్చుండి యాటలాడ నారంభించిరి. మొదట గొందరు బాలురు కసరత్తులు, పికిలిపిట్ట పందెములు కౌజుల పందెములు, పొట్టేళ్ళ పందెములు జరిపిరి. బంగారు బొంగరములతో బాలచంద్రు డాటలాడునని గ్రామములోని వారందరు చూచుటకు స్త్రీబాల సహితముగా వచ్చిరి. బాలచంద్రుడు బొంగరముల యాటలో మిగుల నేర్పరి. బరువైన యాబంగారు బొంగరమును బాలచంద్రుడు తీసికొని త్రాడుచుట్టి వేయబోవుసరికి బంట్రోతులు గుంపును వెనుకకు నెట్టివేసిరి. మధ్యనున్న విశాలస్థలమున బాలచంద్రుదు నిలిచి బొంగరమును లాగి విసరెను. బొంగరము రుంయి రుంయిమని మ్రోగుచు గిరగిర తిరుగుచుండ బాలచంద్రుడు దానిని తిన్నగ జేతిమీది కెక్కించి కొంతసేపాడించి తరువాత బాణము చివర నిల్పి కొంతసేపాడించెను. తిరిగి నే మీద నాడింప వలయునని బాలుడు బొంగరమును విసరి క్రిందికి వైచెను. అటనున్న యొక యెదురురాతికి గొట్టుకొని, బొంగరము బెడసి ఆవేడుక చూడవచ్చిన యొక కోమటిచిన్నదాని కాలికి దగిలెను. మొనగ్రుచ్చికొనుటచే గాలినుండి రక్తము చిమ్మినక్రోవితో జిమ్మి నటుల గారెను. ఆమె పేరు అన్నమ్మ. అన్నమ్మ మూర్ఛపోయెను. చూడవచ్చిన స్త్రీలంద రాయమకు శీతలోపచారములు గావించిరి. బాలచంద్రుడు తన ప్రమాదమునకు జిం