పుట:Andhraveerulupar025903mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోర్నీడు, కంసాల చందు, అను బాలురతో గలిసి క్రీడా విహారములతో గాలము గడపుచుండెను. లేక లేక పుట్టిన తనయుడుగాన దలిదండ్రు లీబాలకుని స్వేచ్ఛకు భంగము చేయరైరి. తండ్రి యుద్ధమున కేగినసంగతి వినిన బాలచంద్రు డేమి సాహసము చేయునో యని తల్లి యతని స్వతంత్రవిహారమున కెట్టియాటంకము కలుగజేయకుండెను. ఒకనాడు బాలుడు తన తల్లియొద్దకువచ్చి బొంగరములాడ దనకు గోరికగలదనియు బంగారు బొంగరములు చేయించి యిమ్మనియు బ్రార్థించెను. ఆయమ్మ తనకుమారుని బుజ్జగించి మన కివి చాలనిదినములు. మీతండ్రి దూరదేశము పోయుయున్నాడు. మనము వలసలోనున్నారము. ఆటలో బ్రమాదమున బొంగరము లెవరికి దగిలినను దగవులు వచ్చును. దానివలన ననేకకష్టములు ప్రాప్తించును. బొంగరములయాట మానుకొమ్మని యెన్ని తెఱంగులనో చెప్పెను. బాలచంద్రుడు తల్లిమాట వినక నాకు బంగారు బొంగరములె కావలయును. వానితో నేనాడుకొనితీరవలయునని మూర్ఖపు బట్టు పట్టెను. తల్లివిధిలేక సొన్నారుల బిలిపించి వారికి మేలిమి బంగారము నొసంగి బొంగరముల జేయించి కుమారున కొసంగెను. తన సవయస్కులు మిత్రులునగు బాలురనందరను వెంటగొని పొట్టేళ్ళపై నెక్కి, పందెములకు బికిలిపిట్టలు, కౌజులు, తగళ్ళను బట్టించుకొని బాలచంద్రుడు క్రీడారంగముగ నేర్పరచుకొనిన సోలురావులవద్దకు జేరిరి. అంతకు