పుట:Andhraveerulupar025903mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సపరివారసహితముగా వలసబోయెను. నానావస్థలకు లోనై రాజకుమారులతో వలసయందు బడవలసిన కష్టములన్నియు బడి బ్రహ్మనాయడు కడకు గడువుతుదను రాజ్యమునకు రానెంచి మాచర్లరాజ్యము తమకొప్పగింపుమని రాజకుమారులపక్షమున గురిజాలకు వర్తమానము పంపెను. నాయకురా లా దూతను జంపించెను. భాగమీయ వీలుగాదనెను. ఉభయపక్షములకు పల్నాటిసీమలోని నాగులేటి తీరమునందు కారెముపూడిచెంత భయంకర యుద్ధము జరుగవలసివచ్చెను. సమకాలికులగు రాజులందరు రెండుపక్షములలో దమ యన కూలములబట్టిచేరిరి. గురిజాల పక్షమున సర్వభారములు నాయకురాలు వహించి రాజులుగనున్న నలగామరాజును, నరసింహ రాజును, కీలుబొమ్మలుగ జేసి సంగ్రామ ప్రయత్నములు తానె స్వతంత్రించి చేయుచుండెను. నియతకాలమున నుభయ దళములు పరస్పర జిగీషతో యుద్ధము చేయుచుండెను.

బ్రహ్మనాయకుడు రాజకుటుంబమును తన కుటుంబమును వీర మేడపిలోనుంచి బాలచంద్రుని గొంత సైన్యమును సంరక్షణమున కుంచి సంగ్రామరంగ మలంకరించెను. బాలచంద్రుడు పదునాఱుసంవత్సరముల బాలుడు. మిగులగారాబముగా బెరిగినవాడు. ఇత డితరవ్యవహారములలో జోక్యము పెట్టుకొనక తన సవయస్కులగు అనపోతు, కమ్మర కాచెన్న, మంగల మల్లు, చాకల చందు, కుమ్మర పట్టి, వెలమ