పుట:Andhraveerulupar025903mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనమిక బ్రధానకథలోనికి వచ్చుచున్నారము. బ్రహ్మనాయనికి సంతానము లేదు. ఆయనభార్య ఐతాంబ. చిరకాలము సంతానార్థము ఎన్నియో నోములు నోచెను. ఎన్నియో ధానధర్మము లాచరించెను. అన్నసత్రములు పెట్టించెను. సంతానము కలుగదయ్యె. కడకు గజనిమ్మనోము నోచెను. మాచర్ల చెన్నకేశవుని యనుగ్రహమున గర్భవతియై నవమాసములు నిండినవెనుక నొకశుభముహూర్తమున గుమారుని గనెను. జాతకర్మలాచరించి బ్రహ్మనాయకుడు బాలచంద్రుడని యాబాలునకు నామకరణము గావించెను. బాలచంద్రుని వలె నా బాలుడు దినదినాభివృద్ధి నొందుచు దల్లితండ్రులకు గనులపండువు గూర్చుచుండెను.

నాయకురాలు ఒకదినమున గురిజాలకు బ్రహ్మనాయడువచ్చుట గనిపెట్టి కోడిపందెముల వేయించుచు ఓడినకోడి బ్రహ్మనాయనిదని, గెలిచినకోడి తనదని పరిహాసము లాడుచుండెను.. బ్రహ్మనాయ డదిచూచి పౌరుషము నాపుకొనజాలక తాను స్వయముగా గోడిపందెమున బాల్గొని పుంజును విడచెను. నాయకురాలు వేఱొక పుంజును విడచెను. వట్టిపందెములతో లాభము లేదని యెవరిపక్షము కోడి యోడిన వారు పండ్రెండేడులు పరదేశమున వసింపవలె ననియు ఒకయే డజ్ఞాతవాసము గావింపవలెనని కట్టుదిట్టముల జేసికొనిరి. గ్రహచారవశమున బ్రహ్మనాయనికోడి యోడిపోయెను. అనుకొన్న పంతముచొప్పున బ్రహ్మనాయకుడు