పుట:Andhraveerulupar025903mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులోత్తుంగచోడుడు కళింగదేశముపైకి రెండు మాఱులు దండయాత్రకు బయలుదేరి విజయము గడించెను. పరిపాల నారంభమున నొకమాఱు పరిపాలనాంత్యమున నొకమాఱు నని యితని కళింగ దేశ దండయాత్రలకు సంకేతము లిడవచ్చును. కులోత్తుంగుడు తన పుత్రియగు రాజసుందరిని కళింగదేశపాలకున కొసంగెను. మనుమడగు అనంతవర్మ కళింగ దేశమును బాలించుతఱి గొందఱు కాళింగులు తిరుగబడి యరాజక ప్రయత్నములు చేయుచుండిరి. రెండవ దండయాత్రలో నరాజకముల నడంచి అనంతవర్మ రాజ్యమును సంస్కరించి తనపేర కులోత్తుంగ చోడనగరమును గట్టించెను. తరువాతి కాలమున నీనగరము విశాఖపట్టణమను వ్యవహార నామము వహించెను.

కులోత్తుంగ చోడునకు నలువురు ధర్మపత్నులు గలరు. వారిపేరులు మధురాంతక దేవి, దీన చింతామణి, ఎళిశైవల్లభి, త్యాగవల్లి. మధురాంతక దేవియందు ఈరాజన్యునకు ఏడుగురు పుత్రులు ఒకపుత్రియు జనించిరి. పుత్రిక అనంతవర్మ తల్లియగు రాజసుందరి. పుత్రు లేడుగురిలో రాజరాజ చోడగంగు, రాజరాజ ముమ్మడిచోడుడు, వీరచోడు డను మువ్వురె చరిత్రవిదులకు బరిచితులు. కులోత్తుంగ చోడునకు జోడరాజ్య మాక్రమించికొన్న పిదప గంగయకొండపురము, గంగయకొండ చోడపురము అని వ్యవహరింపబడు గంగాపురము