పుట:Andhraveerulupar025903mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియగావించెను. మైసూరురాజ్యమునందలి కొంతభాగమును పాండ్యదేశమును జయించి పంచపాండ్యుల నంకితుల గావించుకొనెను. ఇంతతో దృప్తినొందక మలబారుదేశములోని పశ్చిమ భాగమగు కుడలైనాడునుగూడ జయించి మేటివీరుల ననేకుల బొరిగొని యాదేశమునంతయు లోగొనెను. చేరరాజునకుగల నావికాబలమును సైన్యమును గూడ మట్టుపెట్టి కులోత్తుంగచోడుడు చేర దేశమునందు గూడ దన స్వతంత్ర పతాకమును నిలువబెట్టెను. ఇంచుమించుగ నితడు గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యమునకు సమానవైశాల్యముగల యాంధ్రభాగమును బాలించెనని చెప్పవచ్చును. వేంగిదేశమును గుళోత్తుంగునకు బ్రతినిధిగ బరిపాలించు నతనిపినతండ్రియగు విజయాదిత్యుడు కొంతకాలమునకు (క్రీ.శ.1099) పరలోక గతుండయ్యెను. తరువాత దనకుమారుడగు రాజరాజును వేంగిదేశమునకు బాలకునిగా నియోగించెను. ఎల్లపుడును ఆధ్యాత్మిక చింతామగ్నుడగు రాజరాజు కొంత కాలమునకు రాజ్యభోగములపై విరాగమూని తన పరిపాలనాభారము మఱల దండ్రికప్పగించెను. తరువాత మఱియొక కుమారుడగు వీరచోడుని నియమించెను. ఇతడు దాదాపుగ నాఱు సంవత్సరములు వేంగిరాజ్యము పాలించి కాంచీనగరమునకు బోయెను. తనకుమారుల నందఱను వేంగిదేశము పాలించుట కిటుల నొకనివెంట మరియొకని నియోగించుచు చోళ, వేంగి దేశముల రెంటిని సమానముగ దిలకించుచుండెను.