పుట:Andhraveerulupar025903mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చోడదేశమునకు వచ్చి యరాజకమునంతయు నివారించి తన బావమఱంది యగు పర కేసరివర్మను సింహాసనాసీనుని గావించి చీలిపోయిన సామంతులను బౌరులను గూడబఱచి కొంతకాల మటనుండి రాజ్యమునందు శాంతి స్థాపించి తనదేశమునకు బోయెను. విక్రమాదిత్యు డటులబోయి పోకమున్నె మఱల జోళరాజ్యమునం దశాంతి పెచ్చరిల్లెను. ఈవృత్తాంతము విని విక్రమాదిత్యుడు వచ్చి మఱల మఱల శాంతినెలకొల్పి వెళ్లు చుండెను. చోడరాజ్యము నింక జూచుచున్నయెడ బరుల పాలగునని మార్గమధ్యముననే రాజేంద్రచోడుడు విక్రమాదిత్యుని నోడించి వెనుకకు బంపివైచి యమిత బలసహాయముతో జోడదేశమును జయించి పరకేసరివర్మను జంపి "కులోత్తుంగ చోడనామము" సమస్త సామంతులకు భయంకరమగునటుల జోళమండలము బాలించుచుండెను.

ఇటు చోడరాజ్యము, అటు వేంగిరాజ్యము తన హస్తగతములైనను అంతతో దృప్తినొందక తిరుగబడిన రాజుల నందఱ జయించి తనరాజ్యము మిగుల విస్తరముజేయ సంకల్పించి కులోత్తుంగ చోడదేవుడు చెంగల్పట్టు ఉత్తరార్కాడు మండలములోని పులియారునాడు, ఎళుమూరునాడు గూడ జయించెను. కుంతలదేశమును బాలించుపశ్చిమచాళుక్యులలో బ్రసిద్ధుడగు విక్రమాదిత్యునిగూడ నతని సోదరుడగు జయసింహ సహితముగా నోడించి పూర్వవైరమునకు బ్రతి