పుట:Andhraveerulupar025903mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నటుల నేర్పాటు గావించెను. కులోత్తుంగుని సుగుణములలో విరోధియగు పినతండ్రిని క్షమించి యెప్పటివలె రాజప్రతినిధిగా నేర్పఱచుట యొకటి.

చోడరాజ్యమును బాలించు వీరరాజేంద్రుడు తన పినతండ్రి యగు విజయాదిత్యుని పక్షమవలంబించి తన కనేక విధముల నపకారము గావించెను. చోడరాజ్యము నందు వీర రాజేంద్రునకు బేరుప్రతిష్ఠలు గూడ దగ్గుచుండెను. వీర రాజేంద్రుని మట్టుపెట్టుట కొకమూల కులోత్తుంగుడు యత్నించుచుండ కుంతల దేశాధీశుడును బశ్చిమ చాళక్యుడు నైన విక్రమాదిత్యుడు చోళరాజ్యమును హరింపనెంచి దండయాత్రకు బయలువెడలెను. వీరేంద్రచోడుడు తన దుర్భలస్థితిని దా నెఱింగినవా డగుటచేత గొంత రొక్కమును దన కుమార్తెను విక్రమాదిత్యున కొసంగి సంధిచేసికొనెను. కులోత్తుంగడు మాత్రము చోళదేశము హరించుటకు దాను జేయుయత్నముల నొకటియు మానుకొనలేదు. కాలవశమున వీర రాజేంద్రుడు కులోత్తుంగచోడుడు యుద్ధయాత్రకు రాకముందె మరణించెను

మఱల జోడదేశమున నశాంతియు నరాజకము ప్రబలెను. సామంతులు తిరుగబడి స్వతంత్రులై ప్రతిఘటించు యత్నములో నుండిరి. పౌరులు రాజాజ్ఞ తిరస్కరించుచుండిరి. ఈ పరిస్థితు లెఱింగి విక్రమాదిత్యుడు సైన్యసహితముగ