పుట:Andhraveerulupar025903mbp.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్నము మఱునాటి యుదయమున జరుపవలయునని నిశ్చయించుకొని శిబిరములకు జేరిరి.

ఈ సంగ్రామమునకు ముఖ్యముగ బ్రాహ్మణు లగు నక్కన మాదనగారలు మంత్రులుగ నుండుటయే కారణమని పరిజనుల వలన విని యంత:పుర కాంతలు వీరభటులను దానిషాకు దెలియకుండ హంతకుల బిల్పించి వారి కనేక భూషణముల నొసంగి యక్కన్నమాదన్నగారల వధించి వారితలల గొనిరమ్మని యాజ్ఞాపించిరి. హంతకులు త్రోవలు గాచి దాక్షిణ్యశూన్యులై నిర్దోషులగు నక్కన్న మాదన్నగారల రాజద్వారము ముందు దునిమి యుత్తమాంగ లంత:పురమునకు జేర్చిరి. వెంటనే యంత:పుర కాంతలు ఖండితశీర్షముల నొక వెండిపళ్లెరములోనుంచి మువాజ్జమునొద్దకు బంపిరి. అక్కన్న మాదన్నలు వధింపబడగనే వీరావేశముతో మహమ్మదీయు లందఱు విజృంభించి గోలకొండలోనున్న బ్రాహ్మణుల నందఱను జెండాడి రక్తప్రవాహములచే దుర్గమంతయు గలుషితము గావించిరి. తానీషా మంత్రివర్యుల యొక్కయు బ్రాహ్మణుల యొక్కయు దుర్మరణమునకు విచారము నొంది చేయునదిలేక రెండుకోటుల రూపాయ లపరాధము నొసంగి మువాజ్జంతో సంధి గావించుకొనెను. మువాజ్జం సైనికు లాసంగ్రామములో గోలకొండనగరములో నాలుగైదు కోటులకు బైగా ధనము దోచికొనిరి.