పుట:Andhraveerulupar025903mbp.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును బంపి మిగిలిన సగముసైన్యము నక్కన్నగారి యాధీనము గావించి గోలకొండ దుర్గమును రక్షింప నియోగించెను. అక్కన్న మాదన్నగారల నంతము నొందింప వలయుననియు తానీషాను రాజ్యమునుండి తొలగింప వలయుననియు, దలంచిన వాడగుటచే నౌరంగజీబుచే బంపబడిన మువాజ్జంరాన్‌జహాన్ అనువారితో మహమ్మదు ఇబ్రహీం కలిసి వారిని గోలకొండ దుర్గమునొద్దకు గొనివచ్చెను. ప్రత్యర్థుల సైన్యమంతయు నమితోత్సాహముతో హైదరాబాదునకు సమీపములోనికి వచ్చెను. తానీషా, మహమ్మద్ ఇబ్రహీ మొనర్చిన దుర్మార్గము నంతయు నాలకించి యపజయము నిశ్చయమని భావించి సైనికుల శక్తియున్నవఱకు బోరుమని నియోగించి తాను ప్రాణభీతిచే దుర్గములోనికేగి దుర్గద్వారము లన్నియు మూయించి యఱచేతిలో బ్రాణములు పెట్టుకొని యుండెను.

మువాజ్జం సైన్యము స్వేచ్ఛగా గోలకొండ దుర్గములోనికి గసుగందకుండ బ్రవేశించి ధనవంతుల గృహములదోచి స్త్రీల జెఱబట్టి యనేక దురంతములు గావించిరి. ఈదుర్మార్గములన్నియు స్వామిద్రోహియగు మహమ్మదు ఇబ్రహీము దగ్గరనుండి చేయించెను. రాజ మందిరములో బ్రవేశించి తానీషాను అంత:పురకాంతలను జెఱబట్టదలంచిరి గాని యప్పటికి సాయంకాలమగుటచే గోటభేదించుటకు బొద్దుచాలదని యాప్రయ