పుట:Andhraveerulupar025903mbp.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాదన్నగా రాతురుష్కుని సాహసమునకు మిగుల గోపించి వెంటనే యాతని శిక్షించిరి. దుర్మార్గుడగు నాయవనుడు దేహమునిండ గాయములుగావించుకొని పురములోని మహమ్మదీయు లందఱకు జూపి మాదన్నగారి దుర్మార్గమును వేయివిధముల నుగ్గడించెను. మాదన్నగారి విషయమై తానీషాకు దెల్పినను లాభములేదని మహమ్మదీయు లందఱు నిశ్చయించి బ్రాహ్మణ మంత్రులచే దానీషా చేయించు దుండగములలో నిదియొకటిగ డిల్లీశ్వరునకు నివేదింపుమని వానినిబ్రోత్సహించి పంపిరి. వెంటనేవాడు బయలువెడలి కొన్నిదినములకు డిల్లీకి జేరి యౌరంగజీబును సందర్శించి తానొందిన దురవస్థయు దానిషాయొక్క యధర్మ పరిపాలనము, అక్కన్న మాదన్నల యవినీతి యను నంశములగూర్చి లేనిపోనివి చాలసేపు ఘోషించెను. చాలకాలము నుండి గోలకొండ రాజ్యముకొఱకు ప్రయత్నము జేయుచు విఫలమనోరథుడగుచున్న యౌరంగజీబు గోలకొండ రాజ్యములోని సైనికుల యంతరంగము, రాజద్వేషము నా యవనులవలన సాకల్యముగ విని యిదియె తరుణమని తన కుమారుడగు మువాజ్జం అనువాని కమితమగు సైన్యము నొసంగిపంపెను.

తానిషా, మువాజ్జం గోలకొండ రాజ్యమును ముట్టడింప వచ్చుచున్నాడని విని మార్గమధ్యమున బ్రతిఘటించుటకై తనబలములో సగము నొసంగి మహమ్మద్ ఇబ్రహీం