పుట:Andhraveerulupar025903mbp.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులను వెడలగొట్టుటకు నంగీకరించెను. దీనితో ఈష్టిండియా కంపెనీవారు వ్యాపారము వృద్ధిచేసికొని స్వతంత్రులగుట కవకాశము చిక్కెను.

తానీషయు నక్కన్న మాదన్న గారలు చేయు ధర్మపరిపాలనము విప్లవకారులగు కొందఱకు మిగుల కష్టతరముగ నుండెను. అట్టివారిలో బూర్వము సైన్యాధ్యక్షుడుగ నుండి స్థానభ్రష్టుడైన మహమ్మద్ ఇబ్రహీం ఒకడు. ఇతడుకొంత పలుకుబడి కలవాడగుటచే దీవ్రముగ బ్రయత్నము జేసి యక్కన్న మాదన్నగారలయందు మహమ్మదీయజాతికంతకు నేవము పుట్టించెను. విడిగనున్న నీతనివలన విప్లవమువచ్చునని తానీషా మహమ్మదు ఇబ్రహీమునకు సేనానాయక పదవి మాత్ర మొసంగి వానిని జాగరూకతో దిలకించుచుండెను.

మాదన్నగారు మిగులనాచారపరాయణుడు. ప్రతిదినముదయమున బ్రాత:కాలకృత్యముల దీర్చుకొని చాలసేపు శివపూజ గావించి యనేక బ్రాహ్మణుల నాహ్వానించి వారి పంక్తిని భుజించి రాజకీయ కార్యములు నిర్వహించువాడు. మాదన్న త్యాగశీలుడు. పండితపక్షపాతి. సర్వకాల సర్వావస్థలయందు విద్వత్సహవాసము గావించుటచే నీతనికి గొప్ప పాండిత్యము కూడ నలవడెను. మాదన్నగారు తమ యుపవనములోని సరోవరమున స్నానము గావించుచుండ నిబ్రహీంచే బ్రేరేపితుడై వచ్చి యొకతురుష్కు డా కొలనిలో మునిగెను.