పుట:Andhraveerulupar025903mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యము స్థాపించి మనకపాయము గలిగింతురని తెల్పెను. అక్కన్న మాదన్న లామాటలువిని యందలి సత్యము విచారించి తెలిసికొని గాని తొందరపడరాదని వారి యత్నము లరయుచుండిరి.

పగడాల లింగప్పయే అక్కన్న మాదన్న గారలకు దమకు భిన్నాభిప్రాయము కలుగ జేసెనని తలంచి కంపెనీ వారు గోలకొండకేగి అక్కన్న మాదన్నను సందర్శించి తాము సేనలను వృద్ధిచేయుచున్నది ఆత్మసంరక్షణముకె గాని దేశము నార్జించుటకు గాదనియు తమ పని వర్తకముమాత్రమె యని నివేదించిరి. ఇంతలో మాదన్నగారి తనయుడగు మల్లప్పయను వాని యుపనయనము సమీపించెను. అది గ్రహించి కంపెనీవారు మాదన్నగారి కొక వీసెబరువుగల బంగారు గొలుసు, నాలుగువందల వరహాలు అనేకామూల్యములగు పట్టు వస్త్రములు బహుమానముగా నొసంగిరి. అంతతో బోక మాదన్నగారి పేష్కారునకు గొంతధనము మాదన్నగారి పినతండ్రిగారికి గొంతరొక్కము నొసంగి యందఱ సంతృప్తి పఱచిరి. మాదన్నగారు కంపెనీవారు ధర్మ వర్తనులనియు విధేయులనియు గేవల వ్యాపారులనియు దలంచి యెవరివలన నెట్టి యాటంకములు లేకుండ రేవులలో వ్యాపారవస్తువులు దిగుమతిచేయించుకొని విక్రయించి కొనుటకు ఖండాంతరములనుండి వ్యాపారమునకు వచ్చు నితర వర్త